జాన్వీకి బాయ్ఫ్రెండ్ ఉన్నాడట


జాన్వీ కపూర్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు అట్లుంటాయి మరి. ఏమి కనపడితే కుర్రకారు పిచ్చెక్కిపోతారో అవి కనిపించేలా జాగ్రత్త పడుతూ ఫోటోషూట్ లు చేస్తూ కిరాకు పుట్టిస్తుంది జాన్వీ.

అలాగే, ఆమె భామ ఫలానా హీరో అంటే ఇష్టం, ఫలానా హీరోతో డేటింగ్ కి వెళ్లాలని ఉంది అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ హీరోల అభిమానులను ఖుషీ చేస్తూ వచ్చింది. అలా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూ వస్తోంది. ఆమె ఇటీవల నటించిన ‘మిలి’ అనే సినిమా ఢమాల్ అంది. ఇక ఇప్పుడు ఆమెకి సంబంధించిన ఒక సీక్రెట్ బయటపడింది.

ఆమెకి ఒక బాయ్ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫోటోలు బయటపడ్డాయి.

ఇన్నాళ్లూ ఈ విషయాన్నీ రహస్యంగా దాచి పెట్టింది జాన్వీ కపూర్. కానీ, ఇటీవల వీరిద్దరూ తరుచుగా రెస్టారెంట్లకు, వెకేషన్లకు వెళ్తుండడంతో ముంబై మీడియా ఆరా తీసింది. ఒర్హాన్ (Orhan Awatraman) అనే ముంబై వ్యాపారవేత్తతో ఆమె డేటింగ్ లో ఉందన్న విషయం తెలిసివచ్చింది.

ఒర్హాన్ గురించి అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం ఇది: “అతను నాకు చాలా ఏళ్లుగా తెలుసు. అవసరమైనప్పుడు మన కోసం బలంగా నిలబడే వ్యక్తి దొరకడం కష్టం. అలంటి అరుదైన వ్యక్తి ఒర్హాన్.”

ఇంతకీ మేటర్ ఏంటి? ఉన్నట్టా లేనట్టా? ఆమె పూర్తిగా కమిట్ కావడం లేదు.

 

More

Related Stories