శ్రీదేవి కూతురికి భయం పోయింది!

Janhvi Kapoor

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వి కపూర్.. గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఇప్పటికే ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా వచ్చిన “గుంజన్ సక్సేనా” మూవీతో నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే, జాన్వీ కూడా ట్రోలింగ్ బాగా ఎదుర్కొంది. ఆమె నటనలో పెద్దగా ఇంప్రూవ్ మెంట్ లేదని, కేవలం శ్రీదేవి కూతురు టాగ్ తో నెట్టుకొస్తోందనేది విమర్శ. ఇటీవల నేపోటిజమ్ వివాదం ముదిరిన తర్వాత జాన్వీ బాగా ట్రోలింగ్ చూసింది.

జాన్వీ కూడా కరణ్ జోహార్ కాంపౌండ్ భామే. ఆమె ఇప్పటివరకు నటించిన మూడు సినిమాలు కరణ్ జోహార్ నిర్మించినవే. అందుకే… సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత జాన్వీ కూడా చాలా న్యాస్టీ మెసేజులు చూసింది. కానీ ఇప్పుడు ట్రోలింగ్ అంటే భయం పోయిందట.

సోషల్ మీడియాలో కామెంట్లు చదవడం మానేసింది. ఆ మధ్య పెయింటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానంటూ తను గీసిన బొమ్మల్ని నెటిజన్లకు చూపించింది. అవును ఇప్పుడు పెయింటింగ్ వైపు ద్రుష్టి పెట్టి… ఆ ట్రోలింగ్ ని మనసుకు ఎక్కించుకోవడం లేదు.

Related Stories