మాటల వరకేనా జాన్వీ?

విజయ్ దేవరకొండ అంటే క్రష్
ఎన్టీఆర్ డ్యాన్స్ అదుర్స్… ఆయనతో నటించాలని ఉంది…
దక్షిణాది చిత్రాలు చూస్తూ పెరిగాను
రామ్ చరణ్, అల్లు అర్జున్, దళపతి విజయ్, అజిత్ సార్ల నటన ఇష్టం…

ఇవి జాన్వీ కపూర్ తరచుగా చెప్పే మాటలు. ఆమె నటించిన కొత్త సినిమా విడుదలవుతోంది అంటే చాలు జాన్వీ నుంచి ఇలాంటి మాటలే వస్తుంటాయి. ఇంటర్వ్యూలలో సౌత్ ఇండియన్ హీరోల గురించి తెగ పొగుడుతుంటుంది.

కానీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించమని ఆఫర్లు ఇస్తే మాత్రం రిజెక్ట్ చేస్తోంది. ‘లైగర్’లో మొదట తీసుకోవాలని అనుకున్నది ఆమెనే. ఆమె మొదట ఒప్పుకొని ఆ తర్వాత తప్పుకొంది. అలాగే… ‘అల వైకుంఠపురంలో’, మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో కూడా ఆమెని అడిగారు. కానీ ఆమె యథావిధిగా నో చెప్పింది.

తెలుగు, తమిళ హీరోల గురించి అన్ని కబుర్లు చెప్పే ఈ భామ వారి సరసన నటించేందుకు ఎందుకు వెనుకాడుతోంది? అదే అర్థం కావడంలేదు.

 

More

Related Stories