23వ బర్త్ డే మళ్ళీ జరుపుకుంటుందట

జాన్వీ కపూర్ ఈ నెల 6న 24లోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ 24 బదులు మరోసారి 23వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటుందట. గతేడాది కరోనా కారణంగా తన 23వ బర్త్ డేని సరిగ్గా సెలెబ్రేట్ చేసుకోలేదు. ఇల్లు దాటలేదు. తన ఫ్రెండ్స్ కి పెద్ద పార్టీ ఇవ్వలేదు.

అది మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఈ 24వ బర్త్ డే నాడు 23, 24 …. ఇలా రెండు కేకులు కట్ చేస్తుందట. ఈ సారి ఫ్రెండ్స్ అందరికి పెద్ద పార్టీ ఇచ్చి ధూమ్ ధామ్ గా పుట్టినరోజును జరుపుకుంటా అని చెప్తోంది.

Also Check: Janhvi Kapoor’s Sensuous Pose

జాన్వీ కపూర్ పార్టీ గాళ్. పార్టీలు చేసుకోవడం, పార్టీల్లో డాన్స్ చెయ్యడం ఇష్టం. ముంబైలో ఉంటే ప్రతి వీకెండ్ మస్తీ కంపల్సరీ. గతేడాది కరోనా భయం, లాక్డౌన్ కారణంగా సెలెబ్రిటీలు అందరూ ఇంటిపట్టునే ఉన్నారు. పార్టీ చేసుకోకుండా ఉండలేని జాన్వీ అందుకే ఇప్పుడు డబుల్ డోసులో బర్త్ డే సంబరాలు చేసుకుంటుందట.

Check More Photos: Janhvi Kapoor

More

Related Stories