జాన్వీ కపూర్ బాలీవుడ్ భామ. కానీ ఆమె ఫోకస్ ఇప్పుడు టాలీవుడ్ పైనే ఉంది. ఆమె బాలీవుడ్ లో ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు. ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న “దేవర” మరో ఎత్తు.
ఆమె కెరీర్ లో ఒక పెద్ద హీరో సరసన నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. అందుకే, ఆమె ఈ సినిమాపై ఎక్కువ ఫోకస్డ్ గా ఉంది.
జాన్వీ ప్రస్తుతం ముంబై, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతోంది. “దేవర” సినిమాకి ఏ రోజు డేట్స్ కావాలి అని అడిగితే ఆ రోజు ఇచ్చేస్తుంది. “దేవర” షూటింగ్ పూర్తి అయ్యేవరకు బాలీవుడ్ లో బిజీగా ఉండాల్సిన ప్రాజెక్ట్స్ కి దూరంగా ఉంటోంది.
ALSO CHECK: Janhvi Kapoor sizzles against ‘dark waters’ backdrop
“దేవర” తెలుగు సినిమానే అయినప్పటికీ ఇది కూడా పాన్ ఇండియా చిత్రం. బాలీవుడ్ సినిమాల కన్నా భారీగా విడుదల అవుతుంది. అందుకే, ఇది హిట్ అయితే తనకి హిందీలో కూడా క్రేజ్ పెరుగుతుంది అని ఈ అందాల భామ భావిస్తోంది.
రష్మిక లాంటి దక్షిణాది భామకు ఇన్ స్టాగ్రామ్ లో అన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉండడం ఆమెని ఆలోచింపచేసిందట. సౌత్ సినిమాలకు రీచ్ ఎక్కువ ఉంది అని అప్పుడు గ్రహించిందట. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే సంపాదన కూడా సినిమాల్లో కన్నా ఎక్కువ ఉంటుంది. అది ఆమె టార్గెట్.