జానీ మాస్టర్ హీరోగా ‘రన్నర్’

- Advertisement -
Runner

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ‘రన్నర్’ అనే పేరు పెట్టారు. ఈ రోజు జానీ మాస్టర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

పోలీస్ నేపథ్యంలో తండ్రీ కుమారుల మధ్య అనుబంధంతో సాగే కథతో సినిమా రూపొందుతోంది.

”మా హీరో జానీ మాస్టర్ జానీ గారి నటన, ఆయన క్యారెక్టరైజేషన్, కథలో తండ్రి కుమారుల మధ్య సెంటిమెంట్ సీన్స్ హైలైట్ అవుతాయి. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా, “దర్శకుడు విజయ్ చౌదరి చెప్పారు.

‘అరవింద్ 2’ చిత్ర నిర్మాతలు విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం. శ్రీహరి విజయ ఢమరుక ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

“మా దర్శకుడు విజయ్ చౌదరి మంచి కథ రాశారు. స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా క్లారిటీతో చేశారు. హైదరాబాద్ నగరంలో కొన్నాళ్ళ క్రితం జరిగిన వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది,”చిత్ర నిర్మాతలు అన్నారు.

 

More

Related Stories