జానీ మాస్టర్ హీరోగా ‘దక్షిణ’

Dakshina

కొరెయాగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా మారారు. హీరోగా రెండో సినిమా ఒప్పుకున్నారు. ‘మంత్ర’, ‘మంగళ’ వంటి చిత్రాల దర్శకుడు ఓషో తులసీరామ్ నుంచి జానీ మాస్టర్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

ఈ సినిమాకి  ‘దక్షిణ’ అనే పేరు ఖరారు అయింది.  జులై 2 జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. త్వరలో ఈ సినిమాప్రారంభం కానుంది.

 ‘ఖైదీ నంబర్150’లో ‘సుందరి…’, ‘రంగస్థలం’లో ‘జిల్ జిల్ జిగేలు రాణి’, ‘అల వైకుంఠపురములో’  ‘బుట్టబొమ్మ…’, ‘ఇస్మార్ట్ శంకర్’లో టైటిల్ సాంగ్,  ధనుష్ చిత్రంలో ‘రౌడీ బేబీ’ పాటలకు ఆయనే కొరియోగ్రఫీ అందించారు. ఈ డాన్స్ మాస్టర్ ప్రభుదేవా రూట్లో వెళ్తున్నారు.

Advertisement
 

More

Related Stories