
ఈ ఏడాది ‘పఠాన్’ సినిమాతో షారుక్ ఖాన్ మళ్ళీ బాలీవుడ్ బాద్ షా తానే అని నిరూపించుకున్నారు. దాంతో, ఆయన కొత్త చిత్రం ‘జవాన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ ని సిద్ధం చేసింది టీం.
‘జవాన్’ ట్రైలర్ విడుదలకు భారీ సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమా థియేటర్స్‌లో జవాన్ ట్రైలర్‌ను ప్రదర్శించబోతున్నారు. టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇండియాలో కూడా భారీగానే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘జవాన్’ ట్రైలర్ ని ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమా ప్రింట్లకు అటాచ్ చేస్తున్నారు. అంటే, ఆ థియేటర్లలో ‘జవాన్’ ట్రైలర్ ప్రదర్శితం అవుతుంది.
‘జవాన్’కి దర్శకుడు అట్లీ. అతను ఇప్పటికే ‘రాజా రాణి’, ‘అదిరింది’, ‘విజిల్’, ‘పొలీస్’ వంటి చిత్రాలు తీశారు. ‘జవాన్’ అతనికి హిందీలో మొదటి చిత్రం. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించడం విశేషం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.
షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.