‘ఖైదీవేట’ కథే స్ఫూర్తి!

Nayanthara and SRK

పాత సినిమాల కథలనే అటు ఇటుగా మార్చి తీయడం దర్శకుడు అట్లీకి అలవాటు. మణిరత్నం తీసిన ‘మౌనరాగం’ కథని మార్చి ‘రాజు రాణి’ తీశాడు. రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాల స్పూర్తితో విజయ్ హీరోగా ‘అదిరింది’ అని హిట్ కొట్టాడు. అలాగే, హాలీవుడ్ సినిమా ‘హోమ్ ఫ్రంట్’ని కొద్దిగా మార్చి “పోలీసు” అన్నాడు.

ఇప్పుడు షారుక్ హీరోగా “జవాన్” అనే సినిమా తీస్తున్నాడు అట్లీ. అతనికి ఇది మొదటి బాలీవుడ్ మూవీ. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ఇందులో షారుక్ ఖాన్ తండ్రి, కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్. ఈ సినిమాకి కూడా ఒక పాత కమల్ హాసన్ చిత్రం స్ఫూర్తి అని తెలుస్తోంది.

కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఖైదీ వేట’ అనే చిత్రం మూల కథ తీసుకొని మాడ్రన్ గా మలుస్తున్నాడు అని టాక్. ‘ఖైదీ వేట’ హిందీలో ‘ఆఖరి రస్తా’ అనే పేరుతో అమితాబ్ హీరోగా హిందీలో రీమేక్ అయింది.

మొత్తమ్మీద అట్లీ పాత సినిమాల క్యాసెట్ లు లేకుండా కొత్త కథలు తయారు చేసుకోలేడు అని మరోసారి ప్రూవ్ అయింది.

Advertisement
 

More

Related Stories