జవాన్… ఆల్ టైం రికార్డ్

- Advertisement -
Jawan


వరుసగా రెండోసారి షారుక్ ఖాన్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు మొదటిరోజు. నిన్న విడుదలైన “జవాన్” ఇండియాలో 65 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది ఇండియాలో హిందీ చిత్రాలకు ఆల్ టైం రికార్డు. ఇంతకుముందు రికార్డు “పఠాన్” చిత్రానిది. తన రికార్డును తానే బ్రేక్ చేశారు షారుక్ ఖాన్.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 125 కోట్లు కొల్లగొట్టింది. వరుసగా రెండు చిత్రాలు (పఠాన్, జవాన్) మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్లోబల్ వసూళ్లు తెచ్చిన మొదటి బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్.

జవాన్… పక్కా సౌత్ మసాలా మూవీ. హిందీ ప్రేక్షకులకు కొత్త. అట్లీనే కాదు పలువురు తెలుగు, తమిళ దర్శకులు ఇలాంటి చిత్రాలు చాలా తీశారు. కానీ అట్లీ పాత మసాలాకు మరింత ఘాటు జోడించారు. అందుకే ఫస్ట్ డే కలెక్షన్లు ఇరగదీశాయి.

ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడులోనూ మొదటిరోజు భారీగా వసూళ్లు దక్కాయి. సాధారణంగా బాలీవుడ్ పెద్ద చిత్రాలకు వచ్చే వసూళ్లకు మించి వచ్చాయి. అందుకే ఫస్ట్ డే అదనంగా 15 కోట్ల వరకు సౌత్ నుంచి యాడ్ అయ్యాయి అని అంటున్నారు.

ఈ సినిమాతో దర్శకుడు అట్లీ, హీరోయిన్ నయనతార, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, విలన్ గా విజయ్ సేతుపతి బాలీవుడ్ కి పరిచయం అయ్యారు.

 

More

Related Stories