- Advertisement -

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజరు జయ సాహా అనేక విషయాలు వెల్లడించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెని నిన్న,మొన్నా విచారించారు. విచారణలో ఆమె చాలా విషయాలను బయటపెట్టిందని జాతీయ పత్రికలు ప్రచురించాయి. “సాహో” హీరోయిన్ కి గంజాయి ఆయిల్ వాసన పీల్చుకొని నషాలోకి వెళ్లడం ఇష్టం అని జయ చెప్పిందట.
జయ సాహా …క్వాన్ అనే టాలెంట్ మేనేజిమెంట్ ఏజెన్సీలో పనిచేస్తుంది. ఈ సంస్థ అనేకమంది హీరోయిన్లు, హీరోల వ్యవహారాలను చూస్తుంది. సుశాంత్, దీపిక పదుకోన్, శ్రద్ధ కపూర్, రానా, ఇలా చాలా మంది క్వాన్ తో లింక్ ఉన్నవారే.
ALSO READ:నిజంగా నేను తాగను: రకుల్

ఆమె చెప్పిన వాటిలో కొన్ని పాయింట్స్…
- శ్రద్ధ కపూర్ తో నేను చేసిన వాట్సాప్ చాట్స్ నిజాలే. ఆమె కోసమే సీబీడీ ఆయిల్ (గంజాయి నూనె)ని కొన్నాను. ఆమెకి సీబీడీ ఆయిల్ ఇచ్చిన మాట వాస్తవమే.
- శ్రద్ధ కపూర్ తో పాటు సుశాంత్ సింగ్ రాజపుత్, రియా చక్రవర్తి, మధు మంతెన వర్మ (రామ్ గోపాల్ వర్మ బంధువు, బాలీవుడ్ నిర్మాత)లకు కూడా ఇచ్చాను.
- సుశాంత్ సింగ్ తాగే చాయ్ లో నాలుగు డ్రాప్స్ గంజాయి నూనె వేయమని రియాకి చెప్పింది కూడా నిజమే. సుశాంత్ కి ఆ అలవాటు ఉంది.