మళ్ళీ పెళ్లి చేసుకున్న జెన్నిఫర్ లోపెజ్

Jennifer Lopez


హాలీవుడ్ భామ జెన్నిఫర్ లోపెజ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆమె మీద తెలుగులో ఒక పాటే ఉంది. త్రివిక్రమ్ తీసిన ‘జల్సా’ సినిమాలో హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ హీరో పవన్ కళ్యాణ్ “జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి” అంటూ పాటేసుకుంటాడు. ఒకప్పుడు ప్రపంచ అందెగత్తెల్లో ఒకరిగా హల్చల్ చేసేది.

ఇప్పుడు ఆమె వయసు 52 ఏళ్ళు. ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకొంది. గత శనివారం ఆమె హాలీవుడ్ హీరో, దర్శకుడు బెన్ అఫ్లెక్ ని పెళ్లాడింది. అతను ఆమె కన్నా మూడేళ్లు చిన్నవాడు. ఆమెకి ఇంతకుముందు 3 పెళ్లిళ్లు జరిగాయి. ఇది నాలుగో పెళ్లి. బెన్ అఫ్లెక్ కి రెండో పెళ్లి. మొదటి భార్యకి విడాకులు ఇచ్చి చాలా కాలం అయింది. మొదటి భార్యతో అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక జెన్నిఫర్ కి మూడో భర్తతో ఇద్దరు కవలలు పుట్టారు.

జెన్నిఫర్, బెన్ అఫ్లెక్ మధ్య స్నేహం 20 ఏళ్లుగా ఉంది. 2003లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కుదరలేదు.

జెన్నిఫర్ కి 52 ఏళ్ళు కానీ ఆమె అలా కనిపించదు. ఇక బెన్ అఫ్లెక్ హాలీవుడ్ లీడింగ్ హీరోల్లో ఒకరు.

 

More

Related Stories