
అనుకున్నట్లే జరిగింది. జెస్సీ పేరుతో పాపులరయిన జస్వంత్ పగడాల ఇంటిముఖం పట్టాడు. ఈ వీకెండ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళింది అతనే. జెస్సీ కొంతకాలంగా ‘వెర్టిగో’ వ్యాధితో బాధపడుతున్నాడు. బిగ్ బాస్ లోకి ఎంటరయ్యాక అది మరింత ముదిరింది.
హౌస్ లో ఉన్నప్పుడే వైద్యులు వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ, అతనిలో పెద్దగా మార్పు రాలేదు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఉండడం అతని వల్ల కాలేదు. దాంతో, ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియని ఆపేశారు. ఎలాగూ జెస్సీని ఇంటికి పంపాలి కాబట్టి ఎలిమినేషన్ ని పక్కన పెట్టి అతన్ని పంపించేశారు.
జెస్సి ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. వెర్టిగో అనేది కళ్ళు తిరగడం లాంటిది. కాకపొతే, అది చాలా తీవ్రంగా ఉంటుంది. అంతా తలకిందులుగా కనిపిస్తుంటుంది.
ఈ వారం కాజల్, సిరి హనుమంతులో ఎవరో ఒకరు ఇంటిముఖం పట్టాలి. కానీ, ఇద్దరూ మరో వారం హవా కొనసాగిస్తారు.