మే 3న ‘జితేందర్ రెడ్డి’

Jithender Reddy

‘బాహుబలి’తో పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రే గతంలో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే సినిమాలో హీరోగా నటించారు. ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇందులో ఇతనే కథానాయకుడు.

ఈ సినిమా రిలీజ్ డేట్ ని మే 3గా ఫిక్స్ చేసింది టీం.

“హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ మంచి క్యూరియాసిటీని పెంచాయి. జగిత్యాలలో 1980లలో నిజంగా జరిగిన కథ. రియల్ స్టొరీని బాగా తియ్యడానికి చాలా రీసెర్చ్ అవసరమైంది. దాని కోసం నేను మా టీం వర్క్ ఔట్స్ చేసి, రిఫెరెన్సులు తీసుకుని, సలహాలు తీసుకుని చాలా జెన్యూన్ గా చేసిన సినిమా ఇది,” అని దర్శకుడు విరించి వర్మ అన్నారు.

“ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ, ‘మా జితేందర్ రెడ్డి ‘లాంటి యాక్షన్ స్టొరీని కూడా అద్భుతంగా తెరకెక్కించారు,” అని నిర్మాత రవీందర్‌ రెడ్డి అన్నారు.

Advertisement
 

More

Related Stories