
దర్శకుడు విరించి వర్మ కూడా రూట్ మార్చారు. ప్రేమకథలు తీసే విరించి వర్మ ఇప్పుడు ఒక యాక్షన్ డ్రామా తీస్తున్నారు. అదీ కూడా తెలంగాణ నేపథ్యంలో కావడం విశేషం. ఆయన తీస్తున్న కొత్త చిత్రం పేరు… ‘జితేందర్ రెడ్డి’. “హిజ్(హిస్టరీ) స్టోరీ నీడ్స్ టు బీ టోల్డ్” అనే ట్యాగ్‌లైన్‌తో ఓ పోస్టర్ ని తాజాగా విడుదల చేశారు.
ఇంతకుముందు ‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ వంటి చిత్రాలు తీశారు విరించి వర్మ.
ఒక నాయకుడు చిన్న పాపను పక్కను కూర్చోబెట్టుకుని ప్రజల కష్టాలు వింటున్నట్లు పోస్టర్‌లో చూపించారు. ఇంతకీ ఎవరు ఈ జితేందర్ రెడ్డి? ఏంటి ఆయన కథ? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
పోస్టర్‌లో కనిపిస్తున్న కథానాయకుడిగా నటిస్తున్నది ఎవరనేది రివీల్ చేయలేదు కానీ టెక్నీషియన్లు మాత్రం మంచి పేరున్నవారే. వి.ఎస్. జ్ఞాన శేఖర్ కెమెరామెన్ కాగా గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.