జోహార్ – మూవీ రివ్యూ

Johar

ఒకరితో ఒకరికి సంబంధం లేని కొన్ని క్యారెక్టర్లను, ఘటనల్ని తీసుకొని.. వాళ్లందర్న ఓ కామన్ థ్రెండ్ కిందకు తీసుకొచ్చి కలిపే సినిమాలు గతంలో కొన్ని చూశాం. వివిధ నేపథ్యాలు కలిగిన వ్యక్తులు ఒక ప్రత్యేక పరిస్థితిలో కలుసుకునే లాంటివి వేదం, మనమంతా లాంటి సినిమాల్లో చూశాం. ఇప్పుడు అదే స్టయిల్ ఆఫ్ కథ, స్క్రీన్ ప్లేతో వచ్చింది జోహార్ సినిమా. అయితే “వేదం”, “మనమంతా” సినిమాల్లా ఇది బలమైన పాయింట్ తో పాత్రల్ని కలపలేకపోయింది. అందుకే ప్రిమైస్ బాగున్నా… కథనంతో నిరాశపరిచింది.

నిజానికి ఈ సినిమాలో తీసుకున్న పాయింట్ బాగుంది. రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంక్ కోసం పై పైకి మెరుగులకే నిధులు కేటాయిస్తూ, ప్రాధాన్య అంశాలకు నిధులు కేటాయించకపోతే… జరిగే పరిణామాలు ఏంటి అనేది దర్శకుడు చెప్పాలనుకున్నాడు. ఆ స్వార్థ రాజకీయాలకు వివిధ వర్గాల ప్రజలు ఎలా బలవుతారనే అంశాన్ని చెప్పేందుకు.. నలుగురు పేదవారి జీవితాల కథలు చూపించాడు. సీఎం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల వీరి జీవితాల్లో చీకటి రావడం అనేది పాయింట్. ఈ విషయంలో ఏ పేచీ లేదు.

అయితే న్యూస్ ఛానెల్స్ లో చర్చలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇలా అందరికీ తెలిసిన పాయింట్ ను న్యూస్ కి మించి ఏమి యాడ్ చెయ్యలేకపోయాడు. నలుగురు జీవితాలు అతలాకుతలం అయ్యే సీన్లతో ఈ మాత్రం ఎంపతీ, సింపతి కలిగించలేకపోయాడు. ఎందుకంటే అవి మనం వార్తల్లో చూసిన ఘటనలే… గుండెని మెలిపెట్టే కథనాన్ని దర్శకుడు ప్రదర్శించలేదు.

ఓ యువ ముఖ్యమంత్రి (కృష్ణ చైతన్య) తన తండ్రి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి, అతడ్ని దేవుడ్ని చేయాలనుకుంటాడు. దీనికోసం భారీ విగ్రహం ఏర్పాటుచేయాలనుకుంటాడు. అలాగే మరో పక్క ఉద్దానం కిడ్నీ సమస్యతో బాధపడే మహిళా రైతు (ఈశ్వరీ రావు), అథ్లెట్ అవ్వాలనుకునే, రోడ్డుపై సర్కస్ చేసుకునే ఓ అమ్మాయి (నైనా గంగూలీ), వ్యభిచార గృహంలో ఉంటూ బాహ్య ప్రపంచాన్ని చూడాలనుకునే ఓ టీనేజ్ యువతి (ఎస్తేర్), సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో పనిచేసి స్వతంత్ర్యం వచ్చిన తర్వాత పిల్లలతో అనాథాశ్రయం నడిపే ముసలాయన (శుభలేఖ సుధాకర్) ఉంటారు. యువముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల వీళ్ల జీవితాలు ఏమయ్యాయనేది ఈ సినిమా కథ.

క్లైమాక్స్ ఏంటనేది అందరూ ఊహించేదే. కాకపోతే ఆ క్లైమాక్స్ కు చేరుకునే ప్రయాణం భావోద్వేగంగా ఉంటే బాగుండేది. ఎస్టాబ్లిషన్ మెంట్ సీన్స్ బాగా రాసుకున్న దర్శకుడు…..తర్వాత పట్టు కోల్పోయినట్టనిపించింది. ఫలితంగా చివరికి వచ్చేసరికి “జోహార్” సాదాసీదా చిత్రం అనిపించుకుంది. మంచి పొలిటికల్ సెటైర్ గా నిలబడే అవకాశం మిస్ అయింది.
రేటింగ్: 2/5

Rating: 2/5
Reviewed by – MK

బ్యానర్‍: ధర్మసూర్య పిక్చర్స్
తారాగణం: అంకిత్‍, ఎస్తేర్‍, శుభలేఖ సుధాకర్‍, చైతన్య కృష్ణ, నైనా గంగూలి, ఈశ్వరిరావు
రచన: రామ్‍ వంశీకృష్ణ
మ్యూజిక్ : ప్రియదర్శన్‍ బాలసుబ్రమణ్యన్‍
ఎడిటింగ్ : సిద్ధార్థ్ తాతోలు, అన్వర్‍ అలీ
సినిమాటోగ్రఫీ : జగదీష్‍ చీకటి
నిర్మాతలు: సందీప్‍ మార్ని, రత్నాజీరావు మార్ని
కథ, కథనం, దర్శకత్వం: తేజ మార్ని
విడుదల తేదీ: ఆగస్ట్ 14, 2020
ఓటీటీ: ఆహా
Advertisement
 

More

Related Stories