వైజాగ్ లో జూబ్లీహిల్స్… జగన్ ప్రామిస్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలుగు సినిమాకి అనేక వరాలు ప్రకటించారు. తగ్గించిన టికెట్ ధరలను పెంచడమే కాదు, పెద్ద సినిమాలకు మరింత రేటు పెంచుకునే వెసులుబాటుని కల్పిస్తామని హామీ ఇచ్చారు.

“పారితోషికాలు కాకుండా 100 కోట్లు ఆ పై పెట్టుబడితో నిర్మించే భారీ చిత్రాలు …మన రాజమౌళి అన్న అలాంటి వాటికి పేరొందారు కదా…. అలాంటి చిత్రాలకు అధిక రేటు అమ్మే విషయాన్నీ కూడా పరిశీలిస్తున్నాం. కానీ అన్ని సినిమాలకు అనుకూలంగా ఉండే టికెట్ రేట్లు ఉండాలి అనే ఉద్దేశంతో చిరంజీవి అన్నతో అనేక సార్లు మాట్లాడి ఒక కొలిక్కి తెచ్చాం,” అని చెప్పారు జగన్.

చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణ మురళి, అలీ, తదితరులు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ సంధర్భంగా జగన్ సినిమా ఇండస్ట్రీ హీరోలను, ఇండస్ట్రీని వైజాగ్ కి తరలి రావాలని కోరారు.

“నిజానికి ఆంధ్రప్రదేశ్ నుంచే తెలుగు సినిమాకి ఆదాయం ఎక్కువ వస్తోంది. తెలంగాణ నుంచి 35 శాతం ఆదాయం ఉంటే ఏపీ నుంచి 60 శాతం ఉంది. మన దగ్గరే థియేటర్లు కూడా ఎక్కువ. విశాఖపట్నంలో హైదరాబాద్ స్థాయిలో సినిమా పరిశ్రమని అభివృద్ధి చేద్దాం. మీరు అంతా విశాఖకి షిఫ్ట్ అవ్వాలి. కావాలంటే అందరికి అక్కడ స్థలాలు ఇస్తాం. స్టూడియోలు కడుతామని ప్రతిపాదనతో వచ్చినవారికి స్టూడియోలకి కావాల్సిన స్థలాలు ఇస్తాం. అలాగే, హైదరాబాద్ లో ఉన్న జూబిలీహిల్స్ లాంటి పోష్ ఏరియాని వైజాగ్ లో కూడా డెవలప్ చేద్దాం,” అని జగన్ అన్నారు.

 

More

Related Stories