- Advertisement -

ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్ ఆగింది. మిగతా అన్ని సినిమాల షూటింగ్స్ తో పాటు ఈ సినిమా కూడా కరోనా లాక్డౌన్ వల్ల నిలిచిపోయింది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేం. ఈ గ్యాప్ లో ఈ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇందులో కీలకమైన అక్క పాత్రకి రమ్యకృష్ణని తీసుకున్నారని ఇంతకుముందు ప్రచారం చేశారు. ఇప్పుడు జ్యోతిక పేరు లైన్లోకి వచ్చింది. కానీ, అటు జ్యోతిక వైపు నుంచి కానీ, ఇటు ‘సలార్’ టీం నుంచి కానీ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. జ్యోతిక ఒప్పుకుంటుందా అనేది చూడాలి.
‘సలార్’ ఒక యాక్షన్ రివెంజ్ డ్రామా. ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది.