ముంబైలో మకాంతో బాలీవుడ్ ఆఫర్లు

Jyothika


ఒకప్పుడు హీరోయిన్ గా ఎంతో పాపులరయిన జ్యోతిక ఇటీవల లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. అలాగే కొన్ని చిత్రాలు మంచి ప్రాధాన్యమున్న పాత్రలు అంగీకరిస్తున్నారు. ఐతే, ఉన్నట్టుండి జ్యోతిక, ఆమె భర్త ముంబైకి మకాం మార్చారు. జ్యోతిక కోరిక మేరకు హీరో సూర్య ముంబైలో ఒక ఇల్లు తీసుకొని ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేశారు.

సూర్య ప్రస్తుతం చెన్నైలో కొన్నాళ్ళు, ముంబైలో కొన్నాళ్ళూ ఉంటున్నారు. జ్యోతిక ఆమె పిల్లలు మాత్రం పూర్తిగా ముంబైలోనే ఉంటున్నారు. పిల్లల చదువు కోసమే ఆమె ముంబైకి షిఫ్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. అసలు విషయం వారికే తెలియాలి.

ఐతే, ముంబైకి ఆమె షిఫ్ట్ కాగానే ఇప్పుడు హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా అజయ్ దేవగన్ సినిమాలో ఒక కీలకపాత్ర దక్కింది. మాధవన్, అజయ్ దేవగన్ హీరోలుగా వికాస్ బైల్ తీస్తున్న కొత్త సినిమాలో ఆమె నటించనుందట. దాదాపు 25 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె హిందీ సినిమా ఒప్పుకోవడం విశేషం.

ఇది హిట్ అయితే జ్యోతికకి మరిన్ని బాలీవుడ్ ఆఫర్లు వస్తాయి.

Advertisement
 

More

Related Stories