ఈసారి పెళ్లిసందడి ఎవరిదో?

పెళ్లిసందడి.. శ్రీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. ఈ సినిమాతో అతడి జీవితమే మారిపోయింది. అప్పట్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్. శ్రీకాంత్ హీరోగా రవళి, దీప్ని భట్నాగర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ అక్కడక్కడ వినిపిస్తుంటాయి. ఇప్పుడీ సినిమా మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చింది.

మరోసారి పెళ్లి సందడి చూపిస్తానని ప్రకటించారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఈ మేరకు ఆయన ప్రకటన చేయడంతో పాటు చాలామంది పేర్లు వెల్లడించారు. గతంలో పెళ్లిసందడికి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చిన కీరవాణి, ఈ హైటెక్ పెళ్లిసందడికి కూడా పాటలు కంపోజ్ చేసే పని పెట్టుకున్నారు. ఆర్కే ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది.

మూవీకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైనట్టు ప్రకటించారు రాఘవేంద్రరావు. అయితే ఇందులో నటీనటులు ఎవరనే విషయాన్ని ఆయన బయటపెట్టలేదు. త్వరలోనే ఆ వివరాలు చెబుతామంటూ తన ప్రకటన ముగించారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

1996లో శ్రీకాంత్, రవళి, బ్రహ్మానందం, శివాజీరాజ్ తదితరులు చేసిన పెళ్లిసందడ్ని అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈసారి పెళ్లిసందడి చేసే ఆ బ్యాచ్ ఎవరో?

Related Stories