ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణ…!

- Advertisement -
K Raghavendra Rao

ఇప్పటివరకు 108 సినిమాలు తీశారు దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ‘పెళ్లి సందD’ అనే కొత్త సినిమా త్వరలోనే రాబోతోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావుతో ‘అడవిరాముడు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ డైరెక్ట్ చేసి తెలుగుసినిమా కమర్షియల్ లెక్కలు మార్చేసిన ఘనత ఆయన సొంతం.ఐతే, కే.రాఘవేంద్రరావు ఎక్కువగా అగ్ర హీరోలతో సినిమాలు తీశారు. హీరోల్లో ఎన్టీ రామారావుతోనే ఆయన ఎక్కువ సినిమాలు చేశారనే ఒక అభిప్రాయముంది. కానీ ఆయన సినిమాల్లో ఎక్కువసార్లు నటించిన హీరో నేనే అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఈరోజు కే.రాఘవేంద్రరావు పుట్టిన రోజు నాడు ఆయనకి విషెస్ అందిస్తూ ఈ విషయాన్ని చెప్పారు మెగాస్టార్.

ఎన్టీఆర్ కి ‘అడవిరాముడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’, ‘గజదొంగ’ వంటి హిట్ చిత్రాలు అందించారు రాఘవేంద్రరావు. మొత్తంగా 11 సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి

చిరంజీవికి ‘అడవిదొంగ’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘ఘరానామొగుడు’, ‘రౌడీ అల్లుడు’ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ‘శ్రీ మంజునాథ’ వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం. రాఘవేంద్రరావు తీసిన 13 సినిమాల్లో మెగాస్టార్ నటించారు.

వీరిద్దరి తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాలు తీశారు. ‘వజ్రాయుధం’, ‘ఘరానా దొంగ’, ‘అగ్నిపర్వతం’ వంటి సంచలన విజయాలు వచ్చాయి వీరి కలయికలో.

 

More

Related Stories