- Advertisement -

మహా దర్శకుడు కె.విశ్వనాథ్ ఇటీవలే కన్నుమూశారు. ఆ కళాతపస్వి 92వ ఏట తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన 24 రోజులకే ఆయన భార్య కూడా తుదిశ్వాస విడిచారు.
ఆయన సతీమణి జయలక్ష్మి ఆదివారం సాయంత్రం చనిపోయారు. భర్త కె.విశ్వనాథ్ చనిపోయిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది.
ఆదివారం మరింతగా దిగజారడంతో కుటుంబ సభ్యులు ఆమెని వెంటనే అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆమె కన్నుమూశారు.
తన భార్య తనకి అన్ని విషయాల్లో అండగా ఉందని కె.విశ్వనాథ్ చెప్తూండేవారు.