కాజల్…కొంచెం కొత్తగా

కళ్లతో మేజిక్ చేయడం కాజల్ కు కొత్తేం కాదు. ఆమె లుక్స్ కు ఫిదా అవ్వని కుర్రాడు లేడు. ఆమె చూపులోనే ఏదో మాయ ఉంటుంది. అలాంటి చందమామ, ఇంకాస్త క్లోజ్ గా, మరింత డీప్ గా ఓ లుక్కేస్తే ఎలా ఉంటుంది. గుండెల్లో మన్మధబాణం గుచ్చుకున్నట్టే. సరిగ్గా అలాంటి ఫొటోనే అప్ లోడ్ చేసింది కాజల్.

మత్తెక్కించే కళ్లతో, అందమైన పెదాలతో కాజల్ ఇచ్చిన ఈ పోజు చూస్తే ఎవరికైనా కళ్లుతిప్పుకోవడం కష్టమే. కాజల్ క్లోజ్ అప్ లుక్ మచ్చలేని చందమామ అంత స్వచ్ఛంగా అద్భుతంగా ఉంది. ఆమె ముఖం ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేస్తోంది.

Also Check: Kajal Aggarwal Photos

ఈ ఫొటోకు కాజల్ ఇచ్చిన క్యాప్షన్ కూడా అంతే కవ్వింతగా ఉంది. కొంచెం కొత్తగా ట్రై చేశా అనే అర్థం వచ్చేలా కామెంట్ పెట్టిన కాజల్, ఆ వెంటనే సరెండర్ అనే పదం కూడా వాడింది. నిజంగానే ఆ లుక్స్ కు కుర్రకారు సరెండర్ అవ్వాల్సిందే.

Related Stories