కాజల్ ఫోటోషూట్ల దూకుడు

Kajal Aggarwal


పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ నటిగా సినిమా అవకాశాలు పొందుతోంది. అందుకే కాబోలు ఇప్పుడు ఫోటోషూట్లతో హడావిడి చేస్తోంది. ఆదివారం ఒకే రోజు మూడు రకాల ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేసింది. అలా ఉంది ఆమె దూకుడు.

36 ఏళ్ల ఈ సుందరి ఇటు వెబ్ సిరీసులు, సినిమాలు వరుసగా ఒప్పుకుంటోంది. ఇటీవలే, హిందీలో ‘ఉమా’ అనే పేరుతో ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కూడా అంగీకరించింది. ఇక తెలుగులో నాగార్జున సరసన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో మూవీ చేస్తోంది. అలాగే, చిరంజీవి సరసన ‘ఆచార్య’ మూవీ కూడా ఉంది.

ఇవి చూడండి: కాజల్ కొత్త ఫోటోషూట్ ఫోటోలు

కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ ఒక ఇంటీరియర్ కంపెనీ రన్ చేస్తాడు. కానీ, పిల్లలు కలిగేంతవరకు నటించాలనేది కాజల్ ప్లాన్.

 

More

Related Stories