అక్కని తల్లిగా చూడాలనుకుంటున్న చెల్లి


కాజల్ అగర్వాల్ గతేడాది పెళ్ళి చేసుకొంది. భర్త గౌతమ్ కిచ్లుతో ముంబైలో కాపురం పెట్టింది. 36 ఏళ్ల ఈ సుందరి నిన్న బర్త్ డే సెలెబ్రేట్ చేసుకొంది. వచ్చే పుట్టిన రోజు నాటికి కాజల్ తల్లి కావాలి అనేది ఆమె చెల్లి కోరిక. అక్క బర్త్ డే సందర్భంగా కాజల్ సోదరి నిషా తన కోరికని బయట పెట్టింది.

నిషా అగర్వాల్ ఏడేళ్ల క్రితమే పెళ్లి చేసుకొంది. ఆమె కొడుక్కి ఇప్పుడు మూడేళ్లు. అక్క కూడా తొందర్లో ఒక అమ్మాయినో, అబ్బాయినో కంటే తన కొడుక్కి తోడుగా ఉంటారని ఆశపడుతోంది నిషా.

మరి చెల్లెలి కోరికని అక్క కాజల్ తీరుస్తుందా? ప్రస్తుతం కాజల్ ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది, తమిళ్ లో ఒక థ్రిల్లర్ మూవీ చేస్తోంది. నాగార్జున సరసన ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఒక మూవీ ఉంది. అలాగే, బాలీవుడ్ లో ‘ఉమా’ అనే ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని ఒప్పుకొంది. మరి ఇన్ని సినిమాలు చేతిలో ఉండగా తల్లి కావాలనే ప్లాన్స్ వేసుకుంటుందా కాజల్?

ఈ షూటింగ్ లు పూర్తి కాకుండా ఆమె తల్లి అయితే, ఆ సినిమాలు ఇబ్బందుల్లో పడుతాయి.

Advertisement
 

More

Related Stories