సముద్రంలో కాజల్ రొమాన్స్

- Advertisement -

పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి హాట్ టాపిక్ గా మారింది కాజల్ అగర్వాల్. ప్రతి రోజూ ఆమె ఏదో ఒక ఒక్క ఫొటోతో అలరిస్తూనే ఉంది. తాజాగా ఆమె పెట్టిన ఫొటో ఒకటి మరింత వైరల్ అవుతోంది.

ప్రస్తుతం కాజల్, తన భర్తతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్ ఐల్యాండ్ లో దిగిన కాజల్ కిచ్లు.. తన ప్రతి మూమెంట్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా అండర్ వాటర్ ఎక్వేరియంలో కాజల్ పెట్టిన ఫొటో వైరల్ అయింది.

అది కేవలం ఎక్వేరియం మాత్రమే కాదు.. ఓ కాస్ట్ లీ కాటేజ్ కూడా. అందులో బెడ్, బాత్ రూమ్.. లాంటి సకల సౌకర్యాలు ఉన్నాయి. అలా ఎక్వేరియంలో చేపల మధ్య, బెడ్ పై భర్త గౌతమ్ తో రొమాంటిక్ గా కాజల్ దిగిన ఫొటో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

చూడండి: కాజల్ హనీమూన్ ట్రిప్ ఫోటోలు

ఎక్వేరియం సందర్శనలో భాగంగా కాజల్ కూడా సాగరకన్యలా తయారైంది. ఆమె ధరించిన డ్రెస్, లుక్స్ అన్నీ ఎక్వేరియం థీమ్ కు సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. 

 

More

Related Stories