కాజల్ వెడ్డింగ్ హంగామా పెద్దదే

Kajal Aggarwal

కాజల్ అగర్వాల్ ఈ నెల 30న పెళ్లాడనుంది. చాన్నాళ్లుగా డేటింగ్ చేస్తోన్న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ఆమె వివాహం. పెళ్లికి పెద్ద హడావిడి లేదు, సింపుల్ గా చేసుకుంటున్నామని కాజల్ ఇంతకుముందు చెప్పింది కానీ.. వాళ్ళింట్లో సందడి మామూలుగా లేదు. కరోనా ఉన్నా… పెళ్ళికి ఉండే హంగామా అంతా యథావిధిగా సాగుతోంది.

రేపు, ఎల్లుండి హల్దీ (పసుపు పెట్టుకోవడం), మెహందీ ఫంక్షన్లు జరుగుతాయి. అలాగే సంగీత్ కూడా ఉంది. 30న పెళ్లి, 31న కొత్త ఇంటిలోకి ప్రవేశం. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం. ఇలా వరుసగా వారం రోజుల పాటు అగర్వాల్, కిచ్లు కుటుంబాల్లో జోర్దార్ హంగామా ఉంటుంది.

పెళ్ళికి ఆమె ప్రత్యేకంగా ఈ హీరోని, హీరోయిన్న్ని ఆహ్వానించలేదు. ఐతే, ఆమెతో “సీత”, “కవచం” సినిమాల్లో జోడిగా నటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం పెళ్ళికి హాజరవుతున్నాడు. పెళ్లి తర్వాత వారం రోజుల పాటు హనీమూన్ ట్రిప్ కూడా ఉంది. ఆ తర్వాతే చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య” సినిమా షూటింగ్లో జాయిన్ అవుతుంది.

Related Stories