సరైన టైం కోసం చూస్తోన్న కాజల్


కాజల్ గర్భవతి అన్న విషయం తెలిసిందే. గర్భం దాల్చడంతో నాగార్జున హీరోగా రూపొందుతోన్న ‘ది ఘోస్ట్’ సినిమా నుంచి తప్పుకొంది. ఐతే, ఆ విషయాన్నీ ఆమె ఇంకా బయటపెట్టలేదు.

సరైన టైం కోసం చూస్తోందట. డెలివరీకి టైం దగ్గర పడినప్పుడు చెప్పాలనుకుంటోంది. ప్రస్తుతం ఆమె షేర్ చేస్తోన్న ఫొటోల్లో తన కడుపు కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. 36 ఏళ్ల కాజల్ అగర్వాల్ గతేడాది తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. మొదటి యానివర్సరీ వచ్చేలోపు గర్భం దాల్చింది. ఐతే, వచ్చే ఏడాది ఆమె నుంచి మూడు సినిమాలు రానున్నాయి.

చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటించింది. ఫిబ్రవరి 4న విడుదల కానుంది. అలాగే, ‘ఉమా’ అనే హిందీ చిత్రం కూడా పూర్తి చేసింది ఈ ఏడాది. అది కూడా వచ్చే ఏడాదే రిలీజ్ అవుతోంది. ఒక వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. తమిళంలో ఒక మూవీ ఉంది.

డెలివరీ తర్వాత రెండేళ్ళు ఇంటివద్దే ఉండి మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ షురూ చేస్తుందట. ‘భారతీయుడు 2’ సినిమాలో కూడా ఆమె హీరోయిన్. ఆగిపోయిన ఆ సినిమా గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు మేకర్స్.

Advertisement
 

More

Related Stories