కాజల్ మొదటి నెల సంబరం!

Kajal and Gautam

కాజల్ అగర్వాల్ గత నెల (అక్టోబర్ 30) తన ప్రియుడిని పెళ్లాడింది. ఈ నెల గ్యాప్ లో మాల్దీవుల్లో హనీమూన్ కి వెళ్లి వచ్చింది. భర్త గౌతమ్ కిచ్లుతో బోలెడన్ని ఫోటోలు దిగి షేర్ చేసింది. ఈ రోజుతో వారి పెళ్ళై నెల రోజులు పూర్తి అయింది. దాంతో ఫస్ట్ మంత్ ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలి అంటూ కాజల్ తన అభిమానులని అడుగుతోంది.

నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి అని చెప్తోంది. మరోవైపు, కాజల్ డిసెంబర్ లో మళ్ళీ షూటింగులతో బిజీ కానుంది. ఆమె మొదట పాల్గొనే షూటింగ్ “ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. “ఖైదీ నంబర్ 150” తర్వాత చిరంజీవి సరసన ఆమె చేస్తోన్న రెండో మూవీ ఇది.

కమల్ తో “భారతీయుడు 2″లో కూడా నటించాలి. కానీ ఆ మూవీ షూటింగ్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు.

More

Related Stories