హనీమూన్ కెళ్లిన కాజల్

Kajal Aggarwal

రీసెంట్ గా పెళ్లి చేసుకుంది కాజల్. భర్త గౌతమ్ తో కలిసి ముంబయిలో కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా చేసింది. ఇక కొన్ని రోజులాగితే ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ కాజల్ మాత్రం హనీమూన్ ప్లాన్ చేసింది.

తన హనీమూన్ ప్లాన్స్ ను బయటపెట్టింది కాజల్. ”బ్యాగులు సర్దేసుకున్నాం, పాస్ పోర్టులు రెడీ” అంటూ రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. అయితే ఈ జంట హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్తోందనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్, తన హనీమూన్ మేటర్ ను దాచిపెట్టే ప్రయత్నం చేయదు. కచ్చితంగా ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రదేశాన్ని షేర్ చేస్తుంది. హనీమూన్ లో భర్తతో గడిపే క్షణాల్ని కూడా నెటిజన్లతో పంచుకుంటుంది. ఇంకాసేపు ఓపిక పడితే ఆమె ఎక్కడ ల్యాండ్ అయిందో తెలిసిపోతుంది.

Related Stories