మెహందీ, హల్దీ… కాజల్ పెళ్లిసందడి

రేపే కాజల్ పెళ్లి. ప్రియుడు గౌతమ్ తో ఏడు అడుగులు నడవనుంది. ముంబైలోని సొంత ఇంట్లోనే పెళ్లి వేడుక. ఐతే, నెల రోజులుగా కాజల్ ఇంట్లో పెళ్లి సందడి కనిపిస్తోంది. ఇక నిన్న, ఈ రోజు మెహందీ, హల్దీ, ఇంకా ఇతర శుభకార్యాలతో కాజల్ మెరిసిపోతోంది. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుకలన్నింటిని ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంద

35 ఏళ్ల కాజల్ పెళ్లి తంతుని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఆమె కోసమే లాక్డౌన్ వచ్చినట్లుంది. లాక్డౌన్ అనౌన్స్ చెయ్యగానే వంటలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. ప్రతి వారం ఒక కొత్త రెసిపీ నేర్చుకున్నాను అంటూ వాటి ఫోటోలను షేర్ చేసింది. అప్పుడు జనం… ఆమె పెళ్ళికి రెడీ అవుతోందని ఫిక్స్ అయ్యారు.

కాజల్ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరికీ పిలుపు అందలేదు. ఐతే, ఆమె హైదరాబాద్ లో పెళ్లి తర్వాత రిసెప్సన్ ఏర్పాటు చేస్తుందంట.

Related Stories