మళ్ళీ మొదలెట్టిన కాజల్!

ఇటీవలే ఓ బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ మళ్ళీ మేకప్ వేసుకొంది. బాబు పుట్టిన నాలుగు నెలలకే ఆమె షూటింగ్ స్పాట్ కి వచ్చింది. ఆమె తిరిగి నటిస్తోంది.

కమల్ హాసన్ హీరోగా శంకర్ తీస్తోన్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) సినిమా షూటింగ్ కి వచ్చింది కాజల్ కిచ్లు. ఐతే, షూటింగ్ లో పాల్గొనే ముందు ఆమెకి మంచి ఫిట్నెస్ కల్పించాలని ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారట. హార్స్ రైడింగ్ చేస్తున్న వీడియోని తాజాగా కాజల్ పోస్ట్ చేసింది.

“ప్రసవం అయిన నాలుగు నెలల తర్వాత మళ్ళీ పనిలోకి వచ్చాను. మళ్ళీ మొదటి నుంచే మొదలుపెడుతున్నట్లుగా అనిపిస్తోంది. నా శరీరం మునుపటిలా లేదు. గర్భం దాల్చక ముందు నేను రోజుకి ఎన్నో గంటలు పని చేసేదాన్ని. ఆ తర్వాత జిమ్ లో కూడా కసరత్తులు చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. శక్తిని కూడదీయడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తోంది. గుర్రం స్వారీ కాదు కదా గుర్రం ఎక్కడం కూడా కష్టంగా ఉంది,” అని చెప్పుకొచ్చింది కాజల్.

కాజల్ ఇంకా పూర్తిగా ‘న్యూ మామ్’ లుక్ లోనే ఉంది. ఐతే, ఫిట్నెస్ కసరత్తులు, షూటింగ్ రెండూ సమాంతరంగా చేస్తున్నట్లు ఉంది కాజల్.

 

More

Related Stories