
60 చిత్రాలు పూర్తి చెయ్యడం అంటే మాటలు కాదు. ఈ నాటి హీరోయిన్లకు 10, 20 సినిమాలు చెయ్యడమే ఒక కల. కానీ కాజల్ అగర్వాల్ అప్పుడే 60 చిత్రాలు పూర్తి చేసింది.
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో ఎక్కువ సినిమాలు చేసింది. ఈ మూడు భాషల్లో ఇప్పటివరకు 60 సినిమాలు చేసిందట.
కాజల్ తాజాగా ఒక తమిళ చిత్రం ఒప్పుకొంది. ఇందులో ఆమెది కొంచెం బోల్డ్ రోల్. ఈ సినిమా ఆమెకి 60వ చిత్రం. పెళ్లి చేసుకొని, ఒక బాబుని కన్న తర్వాత కూడా ఆమె సినిమాలు చేస్తూనే ఉంది. మళ్ళీ బరువు తగ్గి షూటింగ్ లకు రెడీ అయింది. శంకర్ తీస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో ఆమె హీరోయిన్.
ఇక తెలుగులో ప్రస్తుతం బాలయ్య సరసన ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేస్తోంది.