అది మాత్రం మానని కాజల్

పెళ్లి చేసుకుంది, హనీమూన్ లో ఉంది, అన్నీ పక్కనపెట్టిందని అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు. ఓవైపు భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు తన బిజినెస్, బ్రాండింగ్స్ కొనసాగిస్తోంది కాజల్. మాల్దీవుల్లో ఉన్నప్పటికీ ఆమె బ్రాండింగ్స్ అన్నీ టైమ్ ప్రకారం జరిగిపోతున్నాయి.

ఓవైపు దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు ఓ శానిటైజర్ బ్రాండ్ కు ప్రచారం కల్పిస్తోంది కాజల్. ఇంకోవైపు తనకు ఇష్టమైన డిజైనర్, హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేస్తే దానికి ప్రమోషన్ ఇచ్చింది. మరో చేత్తో ఓ బ్యాంక్ కు యాడ్ కూడా చేసింది. ఇలా ఓవైపు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు రెండు చేతులా సంపాదిస్తోంది చందమామ.

లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ నే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఈ లిస్ట్ లో కాజల్ అందరికంటే ముందుంది. చివరికి మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ టైమ్ లో కాజల్ తన బిజినెస్ ఆపలేదు.

Related Stories