కాజల్ ఎంగేజ్మెంట్ రింగ్ ఇదే

Kajal Engagement Ring

సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తాపీగా తన పెళ్లి మేటర్ బయటపెట్టింది కాజల్. ఆమె తన పెళ్లి గురించి ప్రకటన చేసే సమయానికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైపోయింది. మరో వారం రోజుల్లో కాజల్ పెళ్లి చేసుకోబోతోంది. ఎట్టకేలకు ఆమె ఎంగేజ్ మెంట్ రింగ్ ను బయటపెట్టింది.

కాబోయే భర్త గౌతమ్ కిచ్లు తన వేలికి తొడిగిన ఖరీదైన వజ్రపుటుంగరాన్ని బయటపెట్టింది కాజల్. ఎఁగేజ్ మెంట్ రింగ్ చూపిస్తూ చిన్న వీడియో రిలీజ్ చేసింది. తర్వాత అదే రింగ్ కనిపించేలా, ఓ మొబైల్ ఫోన్ కు ప్రచారం కూడా చేసింది. ఈ ఉంగరం కనీసం 10 లక్షల రూపాయలు ఉంటుందంటూ సోషల్ మీడియాలో చిన్నపాటి డిస్కషన్ జరుగుతోంది.

పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఉండాల్సిన ఇంటిపై కూడా ఫోకస్ పెట్టింది కాజల్. గౌతమ్ తో కలిసి ఉండే ఇంటిని దగ్గరుంచి సర్దుకుంటున్న విషయాన్ని కూడా తనే బయటపెట్టింది. కాజల్ పెళ్లి తన ఇంట్లోనే సింపుల్ గా జరగబోతోంది. పెళ్లి తంతు ముగిసిన కొన్ని రోజులకు ఫొటోల్ని తనే స్వయంగా బయటపెట్టబోతోంది.

Related Stories