‘పుత్రోత్సహం’లో కాజల్


లేట్ గా పెళ్లి చేసుకొని, స్పీడ్ గా తల్లి అయిన కాజల్ అగర్వాల్ మాతృత్వపు మధురిమలు ఎంజాయ్ చేస్తోంది. తన కొడుకు నీల్ ఫోటోలను, వీడియోలను తరుచుగా పోస్ట్ చేస్తున్న కాజల్ తాజాగా మరో పోస్ట్ పెట్టింది. తన కొడుకు పెరిగిపోతున్నాడు అంటూ మురిసిపోతోంది.

కాజల్ కొడుకు ఆరు నెలల పసికందు. ఆరు నెలల్లో తన కొడుకుని లాలిస్తూ, పాలిస్తూ తీసుకున్న ఫోటోలను, వీడియోలను ఒక కాలాజ్ గా పోస్ట్ చేసింది.

పిల్లాడిని కన్న నాలుగు నెలలకే ఆమె షూటింగ్ కి వచ్చింది. నాలుగు నెలల్లోనే బాగా బరువు తగ్గింది. మళ్ళీ హీరోయిన్ వేషాల కోసం సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తోంది.

తెలుగులో కూడా అవకాశాల కోసం చూస్తోంది. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతోంది.

 

More

Related Stories