ఆ రెండింటిపై ధీమా

Kajal

కాజల్ పెళ్లి తర్వాత రెండు పెద్ద సినిమాల్లో నటిస్తే రెండూ కలిసి రాలేదు. ఒక సినిమా (ఆచార్య)లో తన పాత్రని మొత్తంగా తొలగించారు. మరో సినిమాలో (భగవంత్ కేసరి) కేవలం కొన్ని సీన్లు మాత్రమే ఇచ్చారు. పాటలు లేవు, ప్రత్యేకంగా ఫోకస్ లేదు. ఐతే, ఆమె కెరీర్ కి ఇక ఊపు రాదు అనుకోవద్దు.

ప్రస్తుతం ఆమె ‘సత్యభామ’ అనే తెలుగు సినిమాతో పాటు ‘భారతీయుడు 2’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ‘సత్యభామ’ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ ది. ‘భారతీయుడు 2’లో కమల్ హాసన్ సరసన పాత్ర. కాబట్టి ఈ రెండింటిపై ఆమె కెరీర్ ఆధార పడి ఉంది. ఈ రెండింటిపై ఆమె ధీమాగా ఉంది.

‘సత్యభామ’ త్వరలోనే విడుదల కానుంది. ‘భారతీయుడు 2’ మాత్రం ఎప్పుడు విడుదల అవుతుందో ఇప్పుడే చెప్పలేం. ఈ సినిమా మూడో భాగం కూడా ఇప్పుడే తీసేయాలని శంకర్ భావిస్తున్నారట. అంటే, మూడో భాగంలో కూడా కాజల్ కి అవకాశం దక్కితే ఆమెకి మరో మూవీ దక్కినట్లు అవుతుంది.

పెళ్లి, పిల్లలు తర్వాత కూడా కెరీర్ కాపాడుకోవాలనే ఆమె ప్రయత్నం అభినందించదగ్గదే. కానీ, భారీ అవకాశాలు రావాలంటే ఆమె ధీమా వ్యక్తం చేస్తున్న ఆ రెండు చిత్రాలు ఆడాలి.

Advertisement
 

More

Related Stories