కాజల్ సినిమా ఇంకా పూర్తవ్వలేదట

- Advertisement -
Kajal Aggarwal

ప్రస్తుతం కాజల్ చేతిలో ”ఆచార్య”, ”ఇండియన్-2” సినిమాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. మంచు విష్ణుతో కలిసి చేసిన మోసగాళ్లు సినిమా కంప్లీట్ అయిందని అంతా అనుకుంటున్నారు. అయితే కాజల్ మాత్రం ”మోసగాళ్లు” ప్రాజెక్టు ఇంకా కంప్లీట్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చింది.

నేషనల్ మీడియాతో మాట్లాడిన కాజల్.. తన వైవాహిక జీవితంతో పాటు అప్ కమింగ్ ప్రాజెక్టులపై స్పందించింది. ఇందులో భాగంగా త్వరలోనే ”మోసగాళ్లు” సినిమా సెట్స్ పైకి కూడా వస్తానని చెప్పుకొచ్చింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విష్ణుకు చెల్లెలిగా కనిపించబోతోంది కాజల్.

ఈ సినిమాకు సంబంధించి ఇంకా తన పోర్షన్ వర్క్ పెండింగ్ ఉందని.. అది కంప్లీట్ చేయాల్సి ఉందని తెలిపింది. దీంతో పాటు తమిళ్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా రాబోతున్న ఓ సినిమాకు కూడా కాల్షీట్లు కేటాయించిన విషయాన్ని కాజల్ బయటపెట్టింది. మరోవైపు తనకు సంబంధించి ఒక ఓటీటీ రిలీజ్ కూడా ఉందని స్పష్టంచేసింది.

 

More

Related Stories