కాజల్ డేంజర్లో పడిందా?

- Advertisement -


‘బిగ్ బాస్ తెలుగు 5’ చివరి దశకు చేరుకొంది. డిసెంబర్ 19న ముగుస్తుంది. ఈ షోలో ఫైనల్ కి ఐదుగురు మాత్రమే వెళ్తారు. ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు ఉన్నారు. అంటే ఈ వీకెండ్ ఒకరు ఎలిమినేట్ కావాలి. ఈసారి ఎలిమినేషన్ రౌండ్లో సన్నీ, మానస్, షణ్ముఖ్, సిరి, కాజల్ ఉన్నారు. శ్రీరామచంద్ర ఫైనల్ లిస్ట్ లోకి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సో ఐదుగురిలో కాజల్, షణ్ముఖ్, మానస్ మధ్య పోటీ ఉందట. అదేనండి ఎలిమినేషన్ విషయంలో.

కాజల్ ఈ వారం బయటికి రావచ్చు. ఎందుకంటే ఆమె ఇప్పుడు పాపులారిటీ లిస్టులో వెనుకబడింది. మిగతా వాళ్ళు వోటింగ్ లో కొంత దూకుడుగా ఉన్నారు.

కాజల్ ఆర్జేగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఒక వెబ్ సైట్ కి యాంకర్ గా చేసింది. తర్వాత తనే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని రన్ చేస్తోంది. ఆమె ఇక్కడికి వరకు రావడమే ఓక వండర్. ఐతే, ఆమె ఈ షోలో చాలా తెలివిగా ఆడింది. టాస్క్ లు పూర్తి చెయ్యడంలో ముందుంది. అందుకే… ఇప్పటిదాకా నిలబడింది.

చివరి నిమిషంలో ఆమెకి ఓట్లు పడితే మాత్రం… కాజల్ టైటిల్ రేసులో ఉంటుంది.

 

More

Related Stories