కొత్త ఇంట్లోకి కాజల్ ఎంట్రీ

రీసెంట్ గా పెళ్లి చేసుకున్న కాజల్, తన వైవాహిక జీవితానికి సంబంధించి ఒక్కో పనిని చక్కబెట్టేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు ఆమె, తన భర్త గౌతమ్ తో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశించింది. గృహప్రవేశ పూజ కూడా నిర్వహించింది.

తామిద్దరం కొత్తింట్లోకి గృహప్రవేశం చేశామంటూ గౌతమ్ వెల్లడించాడు. ఈ మేరకు గృహప్రవేశ పూజకు సంబంధించి ఓ పిక్ కూడా పోస్ట్ చేశాడు. పెళ్లైన వెంటనే తామిద్దరం ఈ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతామనే విషయాన్ని కాజల్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకోవాలని అనుకోవడం లేదు కాజల్. వీలైనంత త్వరగా సినిమా సెట్స్ పైకి రావాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే ఆమె ఓ తమిళ సినిమా షూటింగ్ లో ప్రత్యక్షంకానుంది. ఆ వెంటనే ”ఆచార్య” మూవీ సెట్స్ పైకి కూడా వస్తుంది. సినిమాలతో బిజీ అయితే ఇంటి పనులు చేసుకోవడం కష్టమనే విషయం కాజల్ కు బాగా తెలుసు. అందుకే అన్నీ ఇలా ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటోంది. 

Related Stories