కాజల్ చెప్పేదాంట్లో నిజమెంత?

Kajal Aggarwal with Gautam

పెళ్ళికి ముందు సైలెంట్ గా ఉంది. గౌతమ్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆఖరికి ఇంస్టాగ్రామ్ లో కూడా అతన్ని ఫాలో కాలేదు. కానీ ఇప్పుడు తమది గ్రేట్ లవ్ స్టోరీ అంటూ గొప్పలు చెప్తోంది.

అక్టోబర్ 30న కాజల్ పెళ్లి చేసుకుంది. పదేళ్లుగా తనకు బాగా తెలిసిన గౌతమ్ కిచ్లుతో మూడు ముళ్లు వేయించుకుంది. అంతా బాగానే ఉంది కానీ, అసలు వీళ్లిద్దరి ప్రేమ ప్రయాణం ఎప్పుడు మొదలైందో చెప్తూ కోతలు ఎక్కువ కొస్తోంది అనే మాట వినిపిస్తోంది. అ

పదేళ్లుగా కాజల్-గౌతమ్ ఒకరికొకరు పరిచయం. అయితే మూడేళ్లుగా వీళ్లు డేటింగ్ లో ఉన్నారట. ఎప్పుడైతే లాక్ డౌన్ మొదలైందో అప్పుడు కలుసుకోవడం తగ్గిపోయింది. చూసుకోవడానికి కూడా కుదరలేదు. ముఖానికి మాస్కులు వేసుకొని కిరాణా షాపుల దగ్గర కలుసుకునేవాళ్ళం అంటూ సినిమాటిక్ స్టయిల్ లో చెప్తోంది.

అప్పుడే ఒకర్ని విడిచి ఒకరు ఉండలేమనే విషయాన్ని తెలుసుకున్నారట. ఆ వెంటనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

ఏప్రిల్ లో గౌతమ్, కాజల్ తల్లిదండ్రులతో మాట్లాడి మేటర్ చెప్పాడు. అంతా ఒప్పుకోవడంతో వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా గౌతమ్ కిచ్లుతో తన పరిచయం, ప్రేమ, పెళ్లి సంగతుల్ని బయటపెట్టింది కాజల్. గౌతమ్ సినిమా స్టయిల్ లో తనకు ప్రపోజ్ చేయలేదని, అయితే ప్రపోజ్ చేసే టైమ్ లో అతడి ముక్కుసూటితనం, నిజాయితీ తనకు బాగా నచ్చాయంటోంది కాజల్.

Related Stories