పెళ్లి తర్వాత ఇలా రెచ్చిపోతోంది!

Kajal and Gautam

పెళ్ళికి ముందు తన ప్రియుడు గౌతమ్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అతని ఫోటో కూడా షేర్ చెయ్యలేదు. పెళ్లి తర్వాత మాత్రం చంపేస్తోంది …ఇన్ స్టాగ్రామ్ నిండా నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ. అక్టోబర్ 30న గౌతమ్, కాజల్ పెళ్లి జరిగింది. ఈ ఆరు రోజుల్లో దాదాపు 50 ఫోటోలు షేర్ చేసింది. కొన్ని తన సింగిల్ ఫోటోలు, మరికొన్ని తన భర్తతో కలిసి చేసుకున్న ఫోటోషూట్.

“కర్వా చౌత్” ఫోటోలు అంటూ తాజాగా షేర్ చేసింది. అలాగే, రకరకాల డ్రెస్సుల్లో తన ఫోటోషూట్ ఫోటోలని తన ఫాలోవర్స్ కి అందిస్తోంది. మొత్తానికి పెళ్లి తర్వాత ఆమె ఫోటోల పరంగా రెచ్చిపోతోంది.

Also Check: Kajal Aggarwal – Photos

ఆమెకి ఇన్ స్టాగ్రామ్ లో 16 మిలియన్ (కోటి 60 లక్షల) ఫాలోవర్స్ ఉన్నారు. ఆ రేంజులో ఆమెకి పాపులారిటీ ఉంది. అందుకే ఇన్ స్టాగ్రామ్ లోనే ఎక్కువ యాక్టీవ్ గా ఉంటోంది.

ఇక కాజల్ ఇప్పుడు హనీమూన్ ట్రిప్ వేస్తుందా? లేక ఈ నెల 9 నుంచి మొదలు కానున్న “ఆచార్య” షూటింగ్ కి వస్తుందా అనేది చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న “ఆచార్య” సినిమాలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. త్రిష తప్పుకోవడంతో కాజల్ వచ్చి చేరింది. మార్చిలోనే ఆమె సెట్ కి రావాలి. కానీ లక్డౌన్ వల్ల ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్లో పాల్గొనలేదు. “ఖైదీ నంబర్ 150” తర్వాత చిరంజీవి సరసన కాజల్ నటించడం రెండోసారి.

Related Stories