కాజల్ అగర్వాల్ తగ్గించిందట

- Advertisement -
Kajal Aggarwal


ఏ హీరోయిన్ కూడా తన పారితోషికం తగ్గించదు. క్రేజ్ లేకపోయినా… ఒక లక్ష ఎక్కువే అడుగుతుంది. కానీ, కాజల్ అగర్వాల్ మాత్రం సడెన్ గా తన రేటుకి వేటు వేసిందట. కోత కోసింది. పెళ్లి చేసుకున్న ఆర్నెళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది

కరోనా రెండో వేవ్ రావడం, సినిమాల నిర్మాణం ఆగిపోవడంతో సీనియర్ హీరోయిన్లకు ఇది కష్టకాలమే. దర్శక, నిర్మాతల ఫోకస్ అంతా క్రేజున్న యంగ్ హీరోయిన్లపైనే ఉంటుంది. అందుకే కాజల్ ముందే మేల్కొని డిస్కౌంట్ ఆఫర్లు మొదలుపెట్టినట్లుంది.

నిర్మాతల బ్యాంకు బ్యాలన్స్ తగ్గకుండా, తనకి అవకాశాలు ఉండేలా గతంలో తీసుకున్న పారితోషికంలో దాదాపు 40 నుంచి 50 శాతం తగ్గించి కోట్ చేస్తోందట. ప్రస్తుతం ఈ భామ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి చిరంజీవి ఆచార్య. రెండోది నాగార్జున చిత్రం.

ఇక తమిళంలో ఆగిపోయిన ‘ఇండియన్ 2’ ఉంది. అలాగే కొన్ని వెబ్ డ్రామాలున్నాయి.

 

More

Related Stories