భగవంత్ కేసరి గురించి కాజల్ మాట

Kajal

నందమూరి బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” ఈ నెల 19న విడుదల కానుంది. దాదాపు 16 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న కాజల్ అగర్వాల్ కి మొదటిసారిగా బాలయ్యతో నటించే అవకాశం కల్పించింది ఈ మూవీ. ఈ సినిమా గురించి కాజల్ చెప్పిన ముచ్చట్లు…

మీ పాత్ర గురించి చెప్పండి…

నేను కాత్యాయని అనే సైకాలజిస్ట్ పాత్ర పోషించాను. తెలివైన అమ్మాయి. అలాగే సరదాగా ఉండే భామ. నేను ఈ రోల్ చెయ్యడం బాగా ఎంజాయ్ చేశా. ఎంతో హాస్యం కూడా ఉంది ఈ పాత్రలో.

“భగవంత్ కేసరి” కథలో నచ్చిన పాయింట్ ఏంటి?

ఆడపిల్ల ఎలా పోరాడాలి, ఎలాంటి సమస్యని అయినా ఎలా తట్టుకొని నిలబడాలి. స్త్రీ సాధికారత గురించి మంచి సందేశం ఉంది. బాలయ్యలాంటి పవర్ ఫుల్ స్టార్ ఇలాంటి సందేశం ఇస్తే బాగుంటుంది. అదే నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని కొత్తగా తీశారు. తన స్టయిల్ కి కొంత భిన్నంగా ఉంటుంది.

Bhagavanth Kesari

బాలయ్యతో మొదటిసారి నటించడం, అలాగే శ్రీలీలతో కలిసి పని చెయ్యడం ఎలా ఉంది?

ఇక బాలకృష్ణ గారితో నటించడం చాలా హ్యాపీ. బాలయ్యకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. మనిషిగా చాలా బోళాగా ఉంటారు. చాలా ఫ్రెండ్లిగా ఉంటారు. అలాగే, శ్రీలీలతో నటించడం కూడా వెరీ హ్యాపీ. ఆమెకి మంచి తపన ఉంది. టాలెంట్ ఉంది. హార్డ్ వర్క్ చెయ్యగలడు. నేర్చుకునే గుణం ఉంది. హీరోయిన్ గా ఆమెకి చాలా మంచి భవిష్యత్ ఉంది.

కొత్తగా చేస్తున్న సినిమాలు ?

“సత్యభామ” అనే సినిమా షూటింగ్ అవుతోంది. అది పూర్తి చేయాలి. అలాగే కమల్ హాసన్ గారి సరసన “ఇండియన్ 2″లో నటించాను. అది త్వరలో విడుదల కానుంది. అందులో కూడా వైవిధ్యమైన పాత్ర.

 

More

Related Stories