మొన్న హారర్.. ఈసారి థ్రిల్లర్

Kajal

పెళ్లి తర్వాత కాజల్ లైఫ్ మాత్రమే కాదు, మైండ్ సెట్ కూడా మారినట్టుంది. కథలు, క్యారెక్టర్ల విషయంలో ఈ హీరోయిన్ ఇప్పుడు ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మొన్నటివరకు హీరోల సరసన గ్లామరస్ గా కనిపిస్తూ.. పాటలు-రొమాన్స్ కే పరిమితమైన ఈ అమ్మడు.. ఇప్పుడు కొత్త క్యారెక్టర్లతో ప్రయోగాలు చేయాలనుకుంటోంది.

త్వరలోనే ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేయబోతోంది కాజల్. జయశంకర్ దర్శకత్వంలో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతోంది ఈ సినిమా. ఏక్ మినీ కథతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంతోష్ శోభన్ హీరోగా గతంలో పేపర్ బాయ్ అనే సినిమా చేశాడు జయశంకర్. ఆ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత విటమిన్-షి అనే మరో వెబ్ మూవీతో అందర్నీ మెప్పించాడు.

ఇప్పుడు మరో ప్రయత్నంగా ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ కథ రాసుకున్నాడు జయశంకర్. ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలపైకి రాబోతోంది. జులై నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాను కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

Advertisement
 

More

Related Stories