కాజల్ కాబోయే భర్త ఇతడేనా?

కాజల్ పెళ్లిపై పుకార్లు ఇప్పటివి కావు. చాన్నాళ్లుగా ఆమె పెళ్లిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. ముంబయికి చెందిన ఓ బిజినెస్ మేన్ ను ఆమె పెళ్లాడబోతోందనే న్యూస్ చాలా పాతది. అయితే ఈసారి ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. కాజల్ కాబోయే భర్త ఇతడేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి పేరు గౌతమ్ కిచ్లు.

వీళ్లిద్దరికీ ఎక్కడ పరిచయమైంది.. ఎలా కలుసుకున్నారు అనే అంశాలపై భిన్న కథనాలు వస్తున్నాయి. వీటిని పక్కనపెడితే.. బాగా చదువుకున్న గౌతమ్, ప్రస్తుతం ముంబయిలోనే ఓ ఇంటీరియర్ డిజైన్ సంస్థను స్థాపించి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడట. దీంతో పాటు మరో 2-3 రకాల వ్యాపారాలు కూడా ఆయనకు ఉన్నాయట.

వచ్చే ఏడాది ముంబయిలో వీళ్లిద్దరి పెళ్లి జరుగుతుందంటూ వార్తలు వస్తున్నాయి. గౌతమ్ ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ ను కాజల్ ఫాలో అవుతోంది కూడా.

Related Stories