కాజల్ మార్షల్ ఆర్ట్స్

Kajal

కాజల్ మార్షల్స్ ఆర్ట్స్ చేస్తే ఎలా ఉంటుంది..? చేతిలో మెషీన్ గన్ పట్టుకొని విలన్లను కాలుస్తుంటే ఎలా ఉంటుంది? త్వరలోనే ఇలాంటి సీన్లు చూడబోతున్నాం. నాగార్జున సరసన చేయబోతున్న సినిమాలో కంప్లీట్ యాక్షన్ అవతార్ లో కనిపించబోతోంది కాజల్.

ఈ మేరకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాజల్ క్యారెక్టర్ పై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో కాజల్ RAW ఏజెంట్ గా కనిపించబోతోంది. ఈ పాత్రకు పొడుగ్గా ఉండే అమ్మాయి కావాలని, ఆ అమ్మాయి కూడా ప్రేక్షకులకు పరిచయమైన ఫేస్ అయి ఉండాలని.. అందుకే కాజల్ ను తీసుకున్నామని ప్రవీణ్ సత్తారు క్లారిటీ ఇచ్చాడు.

అంతేకాదు.. ఈ పాత్ర కోసం కాజల్ ప్రత్యేకంగా 2 వారాల పాటు ట్రైనింగ్ తీసుకోబోతోంది. వైల్డ్ డాగ్ కోసం యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన వ్యక్తి, కాజల్ కు ఈ శిక్షణ ఇవ్వబోతున్నాడు. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ తో పాటు.. మెషీన్ గన్స్ ఎలా పట్టుకోవాలి, ఫైట్ చేసేటప్పుడు ఎలా నిల్చోవాలి లాంటి అంశాలపై కాజల్ శిక్షణ తీసుకోబోతోంది.

More

Related Stories