కాకినాడలో పోకిరి దెబ్బ!

మహేష్ బాబు పుట్టిన రోజుని పురస్కరించుకొని ‘పోకిరి’ సినిమాని మళ్ళీ విడుదల చేశారు కొన్ని థియేటర్లలో. అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఈ షోల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఛారిటీకి ఇవ్వాలనే మంచి సంకల్పం ఉంది. ఐతే, అభిమానుల గోల మాత్రం శృతి మించిపోయింది.

సినిమా చూసి బయటికి రాకుండా… థియేటర్లను పాడు చేశారట. అభిమానుల్లో కొందరి పిచ్చి చేష్టలతో పలు థియేటర్లలో సీట్లు చిరిగిపోయాయి. కొన్ని చోట్ల సీట్లు, అద్దాలు పగిలిపోయాయి. దాంతో, కాకినాడ సిటీ థియేటర్ల యజమానులు సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై, కాకినాడలో అభిమానుల షోలు, బెనిఫిట్ షోలు నిర్వహించకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు.

కొందరి అభిమానుల పోకిరి చేష్టల కారణంగా మొత్తంగా సమస్య వచ్చింది.

వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’4కే, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర 4కే’ విడుదల చెయ్యాలని మెగాభిమానులు ప్లాన్ చేశారు. కానీ, మహేష్ అభిమానులు చేసిన నష్టం చూశాక థియేటర్ల యజమానులు ఇలాంటి షోలు ఇవ్వొద్దని అనుకుంటున్నారు.

 

More

Related Stories