కళ్యాణ్ రామ్ మౌనం దేనికి?

Nandamuri Kalyan Ram

కళ్యాణ్ రామ్ హీరోగా ‘డెవిల్’ అనే సినిమా రూపొందుతోంది. నవంబర్ 24న సినిమా విడుదల కానుంది. నవీన్ మేడారం అనే దర్శకుడితో ఈ సినిమా మొదలైంది. ఫస్ట్ లుక్ కూడా అతని పేరు మీదే విడుదల చేశారు. తీరా మూవీ రిలీజ్ టైంకి అతన్ని తప్పించారు. నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా కూడా తన పేరు వేసుకుంటున్నారు.

ఇంతకుముందు యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన పాత వీడియోల్లో కూడా దర్శకుడు పేరుని తొలగించారు. నవీన్ మేడారం నిర్మాతకు వ్యతిరేకంగా దర్శకుల సంఘం, ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయవచ్చు. కానీ, ఆ దర్శకుడు ఎందుకో గొడవ చెయ్యడం లేదు. విచిత్రంగా హీరో కళ్యాణ్ రామ్ కూడా మౌనం వహిస్తున్నారు.

ఈ సినిమాకి కథ అందించింది శ్రీకాంత్ విస్సా. కానీ, సినిమా సగం పూర్తి అయ్యాక నిర్మాతకు, దర్శకుడికి గొడవలు వచ్చాయి. దాంతో పేరు తొలగించారు.

కళ్యాణ్ రామ్, నిర్మాత ఒక్కటయిపోయినట్లు కనిపిస్తోంది. ఇంతకీ సమస్య ఏంటి? దర్శకుడు చేసిన తప్పేంటి? అనేది ఇంకా వెల్లడించలేదు. సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పుడు మీడియా అడిగే ప్రశ్నకు నిర్మాత, హీరో ఏమి సమాధానం ఇస్తారో చూడాలి.

Advertisement
 

More

Related Stories