- Advertisement -

మరోసారి ‘బింబిసార’ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ సినిమా ఆయన కెరీర్ లో అతిపెద్ద హిట్ గా అవతరించింది. దాంతో, అదే ఫార్ములాని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ అనే సినిమా టీజర్ విడుదలైంది.
ఈ టీజర్లో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. డాపల్ గ్యాంగర్ (మనిషిని పోలిన మనిషి) పాత్రలు అవి. అందులో ఒక పాత్ర క్రూరంగా, ప్రతినాయకుని పద్దతిలో ఉంది. అంటే ఈ సినిమాలో హీరోతో పాటు విలన్ కూడా కళ్యాణ్ రామ్ అనిపిస్తోంది. ‘బింబిసార’లో అదే చేశారు. ఇప్పుడు అదే పద్దతిలో వెళ్తుండడం విశేషం.
కళ్యాణ్ రామ్ నెగెటివ్ ఛాయలున్న రోల్ లో అదరగొడుతున్నారు. అందుకే, ‘బింబిసార’లో నెగెటివ్ పాత్రకి ఎక్కువ పేరు వచ్చింది.
ALSO READ: Amigos teaser: Three Doppelgangers!